ధర్మసాగర్ విద్యార్థి దేవర కార్తీక్ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
Views: 2
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి దేవర కార్తీక్ తన ప్రతిభతో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్-17 విభాగం సాఫ్ట్బాల్ పోటీల్లో విశేష ప్రతిభను కనబరచిన కార్తీక్, డిసెంబర్ 7 నుండి 9 వరకు నిజామాబాద్‌లో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నాడు.
పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు బి. ప్రసన్న కార్తీక్ ప్రతిభను ప్రశంసిస్తూ, అతని విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధర్మసాగర్ మండల విద్యాధికారి డాక్టర్ రామ్ధన్ కార్తీక్‌ను అభినందించి ప్రశంసా పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని కార్తీక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments