రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 

పదివేల కోట్లు వెచ్చిస్తున్నాం 

 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 

ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించండి 

వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 


IMG-20250331-WA0041

    హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:     రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు  సూచనలు చేశారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పదివేల కోట్లు ఖర్చు చేస్తుందని, అధికారులు అంతా మనసుపెట్టి పనిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సమీక్షిస్తామని అన్నారు. వరుస సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న అర్హులకు శాంక్షన్ లెటర్లు ఇవ్వాలని అన్నారు. జూన్ 2 నుంచి 9 వరకు ప్రతి రోజు ఒక మండలం చొప్పున నియోజకవర్గం అంతటా శాంక్షన్ లెటర్లు అందజేయాలని తెలిపారు. జూన్ 9 తర్వాత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని, 50 వేల వరకు లబ్ధి పొందిన వారికి వారం రోజులపాటు, 50 వేల నుంచి రెండు లక్షల వరకు లబ్ధి పొందిన వారికి 15 రోజులపాటు,  2 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్రయోజనం పొందిన వారికి నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన వారికి వెంటనే గ్రౌండింగ్ చేసి నగదు అందజేయాలని కోరారు. జూలై మొదటి వారం కల్లా గ్రౌండ్ ఈ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ఒక యువ అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి,  జిల్లా బీసీ సంక్షేమ అధికారి రామ్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి మురళీధర్ రెడ్డి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్