సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించండి
చిన్నారెడ్డి కి వినతి పత్రం అందించిన సర్పంచుల సంఘం జేఏసీ
Views: 1
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో జరిగిన ఈ భేటీలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో సర్పంచులు బిల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేసే అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేశారని వాటికి సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారనీ, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన చిన్నారెడ్డి వారి వినతి పత్రంపై ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎండార్స్మెంట్ చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments