జర్నలిస్ట్ కార్పోరేషన్ ఏర్పాటుకై మార్చి 16న చలో హైదరాబాద్.
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తోపాటు జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మార్చి 16న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ, దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మీసాల ఎల్లేష్, ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లా సంతోష్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ కోఠి లో గల బీసీ సాధికారిత భవన్లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో వారు మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ సంఘాల ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు లు, హెల్త్ కార్డులు,ఇంటి స్థలాలు సమస్యలతో పాటు దాడులు, హత్యలకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని జర్నలిస్టుల సంఘాలు భావిస్తున్నాయన్నారు. చిన్న పత్రికలు, వార, మాస, పక్ష పత్రికల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక అభివృద్ధి కోసం చర్యలను, రూట్ మ్యాప్ ను ప్రకటించకపోవడం విచారించదగ్గ విషయమన్నారు . ఈ సమావేశంలో ఆయా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తక్కల్లపల్లి రాజేందర్, కోళ్ల శివ, కాటేపాగ హుస్సేన్, మైలారపు ప్రేమ్ , బొల్లెపాక రాజేష్, అంకగళ్ల కరుణాకర్, సుక్క అశోక్, సుంచు లింగయ్య, కడియం నాగయ్య, పెద్దింటి శ్రీనివాస్, మంచాల అనిల్, స్వామి, శివ, నరసింహ, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments