నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కడియం
అంగరంగ వైభవంగా కాంగ్రెస్ నాయకులు గుర్రపు యాదగిరి కూతురి వివాహం
Views: 3
On
హాజరైన చిల్పూర్ దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని పళ్ళగుట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రపు యాదగిరి కూతురు శివాని,ప్రణయ్ ల వివాహం స్టేషన్ ఘనపూర్ లోని ఈఆర్ఎల్ గార్డెన్ లో శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక శాసన సభ్యులు,
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నూతన వధువరులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి,చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో గుర్రపు యాదగిరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు,
స్థానిక నాయకులు చిర్ర నాగరాజు,
సుధాకర్,రత్నాకర్ రెడ్డి, ఆనందం,
చేరాలు,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments