కిష్టారం బాధితుల గోడు పట్టదా?
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం, లోపభూయిష్ట అనుమతుల కారణంగా నాసిరకంగా నిర్మించిన సైలో బంకర్ కేవలం రెండు సంవత్సరాలే నడిచి దెబ్బతినింది. దీంతో బయలుదేరిన దుమ్ము, ధూళి కారణంగా కిష్టారం అంబేద్కర్ కాలనీవాసులు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి 12 రోజులుగా స్థానికులు నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు.
ఈ నిరసన శిబిరాన్ని సందర్శించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, “జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కిష్టారం ప్రజల గోడు పట్టదా? 51% వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం వల్లే ప్రజలు ఇంత నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి లేదా సైలో బంకర్‌ను మరొక ప్రాంతానికి తరలించాలి. లేకపోతే, సంబంధిత అధికారులపై విచారణ జరిపి, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. దీనిపై చర్యలు తీసుకోకపోతే, సింగరేణి యాజమాన్యాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తీసుకెళ్తాం” అని హెచ్చరించారు.
అంతేగాక, రైతుల భూములు సేకరించి నష్టపరిహారం ఇవ్వని అంశం కూడా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని పొంగులేటి డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
కిష్టారం బాధితుల గోడు పట్టదా?శ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, సన్నె ఉదయ్ ప్రతాప్, నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరంరాజు, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవరావు, మట్టా ప్రసాద్, పడిగల మధుసూదన్ రావు, సత్తుపల్లి రూరల్ మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ్, నున్న రవి, నెల్లూరు కోటేశ్వరరావు, రాంబాబు రఘునాథరెడ్డి, నల్లమోతు నాని, వినయ్, బాలకృష్ణ రెడ్డి, శాలి శివ, బొర్రా నరసింహారావు, వసంతరావు, పాలనగా సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments