వైస్ ప్రిన్సిపల్ వేధింపులు…
రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
వికారాబాద్,తెలంగాణ ముచ్చట్లు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.
5వ తరగతి చదువుతున్న తబిత అనే విద్యార్థిని పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది, విద్యార్థులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
వైస్ ప్రిన్సిపల్ వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
తబిత తరచుగా మనస్తాపానికి గురవుతోందని, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ వేధింపులే ఈ ఘటనకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పాఠశాలలో కొంతకాలంగా భయభ్రాంతులకు గురవుతోందని, ఇంటికి వచ్చినప్పుడల్లా తనకు భయం వేస్తుందని చెప్పేదని తల్లిదండ్రులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినిని చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో విచారించనున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా వైస్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Comments