ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

పెద్దమందడి ఎంపీడీవో సద్గుణ

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి

వనపర్తి తెలంగాణ ముచ్చట్లు:

 ఉపాధి హమీ కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో సద్గుణ అన్నారు. మంగళవారం పెద్దమందడి మండల పరిధిలోని ముందరి తండాలో ఉపాధి హామీ పనులు భూమి లెవలింగ్ పనులను ఎంపీడీవో సద్గుణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సద్గుణ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను కూలీల సంఖ్య పెంచాలన్నారు. రాబోయే వర్షకాలం దృష్టిలో పెట్టుకొని రైతులకు కావలసిన భూమిని లెవలింగ్ పనులను చేపట్టాలన్నారు. ఎండాకాలం కావడంతో ముందు జాగ్రత్తగా కూలీలు కు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో కూడా ముందు జాగ్రత్తగా సమస్య లేకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పల్లె ప్రగతి ప్రకృతి వనంలో మొక్కలు పెంచేందుకు బ్రెడ్లు మొక్కలు వేయడానికి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోనే 5000 నుండి 10000 వరకు మొక్కలు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు దృష్టి సారించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం చేస్తే తగ్గున చర్యలు చేపడతామన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్