మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం
Views: 13
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో హోసన్నా మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపింది. మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక స్థాయిని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ దినోత్సవాన్ని సంఘ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సభ్యులు కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మహిళల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, సమాజంలో వారికి మరింత గుర్తింపు రావాల్సిన అవసరంపై చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తమవంతు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొల్లెపాక శ్రీలేఖ, బొల్లెపాక అనిత, ఎర్ర లుధియా, పట్ల సువార్త, నల్ల దీప, పట్ల కవిత,బొల్లెపాక అనూష తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments