పలువురికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం మాజీ కార్పొరేటర్ మచ్చా నరేందర్ సతీమణి శోభారాణి ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.
బిఆర్ఎస్ నాయకుడు టేకులపల్లి పొదిల పాపారావు సతీమణి పార్వతి గుండెపోటుతో మంగళవారం మరణించగా వారికి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. సిపిఐ నాయకులు పుచ్చకాయల కృష్ణ మనవడు గీతాన్ష్ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మంగళవారం మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టేకులపల్లి సొసైటీ చైర్మన్ నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు,నాయకులు మోతరపు సుధాకర్,దేవభక్తిని కిషోర్, దొంగల తిరుపతి రావు, చిలకల వెంకటనర్సయ్య, వెంకటేశ్వర్లు,శ్రీను, ప్రసాద్, శ్రీహరి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments