ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు

విద్యా వ్యవస్థ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది
◆ ఉద్యమ స్ఫూర్తి ఉన్న వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటేనే సమస్యలు పరిష్కరించబడతాయి
◆ వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

విద్యా వ్యవస్థ బాగుపడితేనే ఆ రాష్ట్రం బాగుపడుతుందని, తరగతి గదిలో విద్యార్థిని తీర్చిదిద్ది ఈ దేశ ఉత్తమ పౌరులును చేసే ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు అని, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడే ఉద్యమ స్ఫూర్తిగల వ్యక్తులను ఎన్నుకోవాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కార్యకర్త స్థాయి నుండి టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశానన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ నల్లగొండ జిల్లా కన్వీనర్ గా పనిచేస్తూ.. ప్రొఫెసర్ హరగోపాల్ తో కలసి అఖిలభారత విద్యా పోరాట యాత్ర చేశానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యావంతుల వేదిక ఉపాధ్యాయ జేఏసీలో పనిచేసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందినప్పటికీ ఉపాధ్యాయ ఉద్యమాల్లో కొనసాగుతున్ననన్నారు. గత 40 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిగా... కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేసేందుకు, స్పెషల్ టీచర్స్ కు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరి చేయించేందుకు, అన్ని యాజమాన్యాలలో ఉన్న పాఠశాలలను ఒకే ఎడ్యుకేషన్ బోర్డు కిందికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గత పది సంవత్సరాలుగా విద్యావ్యవస్థ కుంటుపడిందని, కస్తూరిబా, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, అందులో పని చేసే సిబ్బందికి బేసిక్ జీతాలు లేవని, హెల్త్ కార్డులు లేవని, వారి జీతం 10వ తారీకు తర్వాతనే పడటం బాధాకరం అన్నారు. వాటన్నింటి సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా పనిచేస్తానన్నారు. ప్రొఫెసర్ కోదండరాం చొరవుతో ప్రభుత్వంచే 25వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కల్పించారు. భవిష్యత్తులో ప్రొఫెసర్ కోదండరాం సహకారంతో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

కులం, మతం, ప్రాంతం పేరుతో ఎన్నికల్లో నిలబడుతున్నారని, ఓటుకు నోటు, దావత్ లు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, లక్షలు ఖర్చు చేసి మంది మార్బలంతో నామిWhatsApp Image 2025-02-18 at 9.49.22 PM (2)నేషన్లు వేస్తున్నారు అటువంటి వారిని నమ్మొద్దని బుద్ధజీవులైన ఉపాధ్యాయులు, ఆచార్యులు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫిబ్రవరి 27న జరగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఆశీర్వదించాలని పనాల గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకరరావు, ఖమ్మం జిల్లా కన్వీనర్ వి. బాబు, ఖమ్మం జిల్లా నాయకులు జంగిపల్లి రవి, బి ప్రసాద్, లేళ్ల నరసింహారావు, సర్దార్, దేవదాస్, రాజేందర్, నాగేశ్వరావు, నల్గొండ జిల్లా నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్