మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘన నివాళి
అమరవీరుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి
-గృహస్థలాలు, ఉద్యోగాలు కల్పించాలి
– ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు
వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎం ఎస్ ఎఫ్, ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీతో అమరవీరులకు ఘన నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ మాట్లాడుతూ, మాదిగ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సామాజిక సమానత్వ పోరాటంలో వారు చూపిన ఉద్యమస్ఫూర్తి, త్యాగ నిరతి మరువలేనిదని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధననే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాట్లాడుతూ,“మాదిగ అమరవీరుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గృహ స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలి. వర్గీకరణ కోసం వారు ధారపోసిన నెత్తుటి చుక్కల సాక్షిగా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సమానతలేని సమాజాన్ని నిర్మించాలి”అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బోరెల్లి వెంకటయ్య మాదిగ, ఎంఈఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి పరశురాముడు మాదిగ,ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజారాం ప్రకాష్,గంధం నాగరాజు మాదిగ, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ కమిటీ సభ్యుడు ఎడవల్లి వీరప్ప,బేడ బుడగ జంగం రాష్ట్ర అధ్యక్షుడు బాలమియా, మధు మాదిగ, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా వనపర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్, సీపీఐ పట్టణ అధ్యక్షుడు రమేష్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments