కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్ 

కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్ 

IMG-20250309-WA0028ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

మండలంలోని తాటికాయల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖకు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది.కార్యకర్తల సమక్షంలో జరిగిన సమావేశంలో భాస్క రవీందర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నల్ల మొగిలి ఉపాధ్యక్షుడిగా, పెసరు శివకృష్ణ ప్రధాన కార్యదర్శిగా, డాక్టర్ చెల్లోజు రాజు కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.యువజన విభాగం అధ్యక్షుడిగా పట్ల మహేష్,కార్యదర్శిగా దువ్వల సుమన్,చెరుకు రమేష్ సహాయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. మైనార్టీ విభాగానికి ఎండి కమలుద్దీన్, సోషల్ మీడియా విభాగానికి బొల్లెపాక ప్రవీణ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు చేరువై కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తామని, పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ పెసరురమేష్,నాయకులుఎర్రప్రభాకర్,బొల్లెపాకకుమార్,కనుకటి యాదగిరి,నల్ల అశోక్,తొట్టె సదయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్