క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘనపూర్, తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన చింత క్రాంతి కుమార్ ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించగా, సోమవారం స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య వారి ఇంటికి వెళ్లి క్రాంతి కుమార్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.
అదే విధంగా, ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన ఎర్ర దిలీప్ ప్రమాదవశాత్తు మరణించడంతో, తాటికొండ రాజయ్య వారి నివాసానికి వెళ్లి దిలీప్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమాల్లో ఎర్ర అశోక్, ఎర్ర వెంకటస్వామి, పట్ల మీస రాజయ్య, బొల్లెపాక సంపత్, పట్ల మహేష్, బొల్లెపాక నగేష్బొల్లెపాక రమేష్, పట్ల రమేష్, గుర్రపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments