విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి

జనగామ,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉప కేంద్రం నిర్వహణ తీరును, ఫ్యూజ్ కనెక్షన్, విద్యుత్ డిమాండ్, తదితరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.లాగ్ బుక్ ను తనిఖీ చేసి, రికార్డుల్లో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని,అలాగే ఆన్లైన్ లో కూడా పొందుపరచాలని,అదే విధంగా విద్యుత్ ప్రజావాణి గురించి ఆరా తీసి విద్యుత్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని,ట్రిప్ అయితే వెంటనే స్పందించాలని,వేసవి కాలంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా,విద్యుత్ కొరత రాకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని,ఈ క్రమంలో విద్యుత్ అధికారులు వివరిస్తూ నియోజకవర్గ పరిధిలో 10 సబ్ స్టేషన్ లు ఉన్నాయని, సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ రాకేష్, ఆపరేటర్ నయీం, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్