సర్వజ్ఞ విద్యార్ధులకి బంగారు పతకాలు

సర్వజ్ఞ విద్యార్ధులకి బంగారు పతకాలు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ఖమ్మంలోని వీడివోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలయందు 2వ తరగతి చదువుతున్న విద్యార్ధులు జి. కర్ణిక మరియు జి. త్రినయన్ రోలర్ స్కిటింగ్ కాంపిటీషన్ లో ప్రతిభను చాటుకున్నరు. తెలంగాణ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ వారు హైదరాబాద్ లో నిర్వహించిన 2వ తెలంగాణ ర్యాంకింగ్ ఓపెన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ 2024 లో ఖమ్మం జిల్లా తరుపున సర్వజ్ఞ పాఠశాల విద్యార్థులు జి. కర్ణిక మరియు జి. త్రినయన్ బంగారు మరియు వెండి పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆర్. వి. నాగేంద్ర కుమార్  మాట్లాడుతూ స్కేటింగ్ కాంపిటీషన్ లో బంగారు మరియు వెండి పతకాలతో అద్భుతమైన విజయం సాధించిన మా ప్రతిభావంతులైన క్రీడాకారులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి అంకితభావం, కృషి మరియు క్రీడా స్ఫూర్తి మమ్మల్ని ఎంతగానో గర్వపడేలా చేశాయి. ఈ విజయాలు విద్యార్ధుల నిబద్ధతకు మరియు మా సిబ్బంది అందించిన అద్భుతమైన శిక్షణకు నిదర్శనం. భవిష్యత్తులో కూడా సర్వజ్ఞ మీ విజయాన్ని ఆశిస్తున్నది అని తెలియజేశారు. అలాగే డైరెక్టర్ శ్రీమతి కే. నీలిమ మాట్లాడుతూ సర్వజ్ఞ పాఠశాల విద్యార్ధులు చదువుల్లో, ఆటల్లో, క్రమశిక్షణలో అన్ని రంగాలలో విజయాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ పవిత్ర మరియు ఉపాధ్యాయులు క్రీడాకారులకి అభినందనలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్