మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
.రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతల కుటుంబాలను కాంగ్రెస్ ఎప్పుడూ ఆదుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌గంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర అన్నారు.
జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ రెడ్డి తండ్రి లింగాల నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత జోగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఇబ్రహింపురానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహారెడ్డి, జోగారెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అంతేగాక, రఘునాథపల్లి మండలానికి చెందిన కంచనపెల్లి పిఎసిఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్, నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజిగొల్లూరి ఐలయ్య మరణించడంతో, వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరమైనా కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టిపోతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments