అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కడియం కావ్య
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: హనుమకొండ జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం మండలంలోని పెద్ద పెండ్యాల ఆర్.కే. గార్డెన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ మహిళలు సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాలని, ఉద్యోగాలు, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. గాండ్ల కులస్తులు ఐక్యతతో తమ హక్కుల కోసం పోరాడాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గానుగ నూనెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
గాండ్ల కుల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని, ఎంపీ స్థానానికి కేటాయించే నిధుల నుంచి గాండ్ల కమ్యూనిటీ హల్ నిర్మాణానికి మంజూరు ఇస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, రాష్ట్ర మహిళా భాండాగారపు కార్యదర్శి పుష్పలత, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాము, జిల్లా అధ్యక్షుడు జక్కం సురేందర్, ప్రధాన కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.
Comments