సత్తుపల్లిలో...రెడ్ బుక్ డే

సత్తుపల్లిలో...రెడ్ బుక్ డే

సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు: 

మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలైన రోజు సందర్భంగా సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావుల రాజబాబు అధ్యక్షత వహించగా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మోరంపూడి పాండురంగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళికను విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజును రెడ్ బుక్ డేగా జరుపుకోవాలని అన్నారు. కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు కమ్యూనిజమే ప్రత్యామ్నాయ మార్గమని చెప్పారు. మతతత్వ, కార్పొరేట్ విధానాలు దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయన్న విషయాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, ఫాసిస్ట్ భావజాలాన్ని అర్థం చేసుకొని పోరాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, రావుల రాజబాబు, చావా రమేష్, మోరంపూడి వెంకట్రావు, గుదే రాము, ఓలేటి శ్రీహరి, చప్పిడి భాస్కర్, మహిళా సంఘం నాయకులు పాకలపాటి ఝాన్సీ, చెరుకు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్