ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు,
హసన్ పర్తి మండలం, ఎల్లాపూర్ గ్రామ శివారులో గల ఆర్బిట్ ఇ-టెక్నో పాఠశాలలో మంగళవారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్, కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను నూతన ఆవిష్కరణలుగా మలచాలని, భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి, దేశానికి మంచి పేరు తేవాలని కోరారు.నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, వాటిని నియంత్రించడానికి పరిష్కార మార్గాలను చూపే విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి 100కు పైగా కొత్త వస్తు కళాఖండాలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో రోబో, గడ్డిని కోసే పరికరం, మూత్రపిండాలు పనిచేసే విధానం, వాటర్ ఓవర్ లో అలారం, శ్వాస వ్యవస్థ పరమాణు నిర్మాణం, మినీ చిల్లి కట్టర్, హైడ్రాలిక్ బ్రేక్, ఎయిర్ కూలర్, ఇరిగేషన్, అగ్నిపర్వతం, వాటర్ స్మోకింగ్, రోడ్డు పాన్ హౌస్ మొదలైనవి విద్యార్థినివిద్యార్థులు తయారు చేసినట్లు చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్.హారిక-భగవాన్ రెడ్డి అకాడమిక్ ఇంచార్జ్ వాసుదేవ రెడ్డి, గణిత, సైన్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు వెంకటేష్, రంజిత్, వినయ్ కుమార్, ఇంద్రాణి,రాజ్ కుమార్, రూపా దేవి, శ్రీకాంత్, కృష్ణవేణి, శ్వేతా రెడ్డి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments