ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తోకల విజయ కుమార్
రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామానికి చెందిన తోకల విజయ కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. “పబ్లిక్ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగంపై రిస్క్ మరియు రివార్డ్స్ – కస్టమర్ల ప్రభావం” అనే అంశంపై డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ పర్యవేక్షణలో పరిశోధన చేసి, ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డిగ్రీ అందుకున్నారు.
విజయ కుమార్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎం.కామ్ పూర్తి చేసి నెట్, జేఆర్ఎఫ్, సెట్ అర్హతలను సాధించారు. అదనంగా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ డిగ్రీను పూర్తిచేసి సెట్ అర్హత పొందారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆధ్యాపకునిగా పనిచేస్తున్నారు.విజయ కుమార్ డాక్టరేట్ పొందిన సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.
Comments