మాదిగ అమరవీరులకు ఘన నివాళి
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సోంపల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగ అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఎస్‌పి జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగలు మాట్లాడుతూ.....“మాదిగ అమర వీరులారా, మీ త్యాగాలను జాతి ఎన్నటికీ మరువదు. మీరు చిందించిన నెత్తుటి చుక్కల సాక్షిగా ఎస్సీ వర్గీకరణ సాధించగలిగాం. అది సంపూర్ణంగా అమలవడమే లక్ష్యంగా, మాదిగ హక్కుల సాధనకు మాన్యులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నిరంతరం పోరాడతాం. భవిష్యత్తు తరాలకు మీ త్యాగాలను చరిత్రగా అందించడమే మా బాధ్యత!”అని తెలిపారు.
పోరాట గమనంలో అమరులైన వారి స్మృతులను సత్కరించడంతో పాటు, అనారోగ్య కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. 30 ఏళ్లుగా ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి త్యాగాలను గుర్తించుకుంటూ, మాదిగ సామాజిక న్యాయం కోసం చేసిన కృషికి జేజేలు పలికారు.
ఈ కార్యక్రమంలో తెలబండ్ల రవి మాదిగ, సిర్రా నాగేశ్వరరావు మాదిగ, మీరా సాహెబ్ మాదిగ, గింజారపు ప్రభాకర్ మాదిగ, పొన్నాల సురేందర్ మాదిగ, నడిమిండ్ల దామోదర్ మాదిగ, ములుగు మహేష్ మాదిగ, దర్శనాల భారతి మాదిగ, పెద్దాడ ప్రకాష్ రావు మాదిగ, నకిరేకంటి యాకయ్య మాదిగ, పాముల సుబ్బయ్య మాదిగ, వేల్పుల సూరయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments