ఆసర్ ఖానా భవన నిర్మాణానికి విరాళం అందించిన రంగు హరీష్
Views: 95
On
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
గ్రామంలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే పీరీల పండుగ సందర్భంగా నిర్మించనున్న ఆసర్ ఖానా భవన నిర్మాణానికి స్టేషన్ ఘన్పూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్,బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రంగు హరీష్ గౌడ్ రూ.5,000 విరాళం అందించారు.
ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ, సాంప్రదాయ పండుగలు, ఆరాధనా స్థలాల అభివృద్ధికి అందరూ సహాయపడాలని, ఈ తరహా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనడం గ్రామా అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి ఏదైనా అవసరం ఉంటే సహాయ సహకారాలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.గ్రామ ప్రజలు, పెద్దలు పలువురు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎండీ హిమామ్, దిండిగాలా రాజయ్య, భాషబోయినా రాజు, గుర్రపు రాజు, దిండిగాలా కిషన్, రొయ్యల రాజు, భర్మ చంద్రలింగం తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments