పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాలతెలంగాణ ముచ్చట్లు: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది.

షెట్‌పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది. చదువు ఇష్టం లేకపోవడంతో ఇంటికి వచ్చింది. అయితే, మళ్లీ బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో తండ్రి చేర్పించాడు.

ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఒత్తిడికి గురైన హాసిని, ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి, చదువు పై భయాందోళనలను మరోసారి ప్రశ్నించేలా చేసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్