కిస్ ఎమోజీతో మొదలైన ఘోరం
భార్యతో పాటు మరో వ్యక్తిని హత్య చేసిన భర్త
కేరళ, పతనంతిట్టతెలంగాణ ముచ్చట్లు::
ఒక చిన్న ఎమోజీ కారణంగా ముగ్గురి జీవితాలు నాశనమైన ఘటన పతనంతిట్టలో జరిగింది. వాట్సాప్‌లో కిస్ ఎమోజీ పంపించిందనే కారణంతో భర్త అగ్గిపడి భార్యను, మరో వ్యక్తిని హత్య చేశాడు.
పతనంతిట్టకు చెందిన భైజు, వైష్ణవి దంపతులు. వీరి ఇంటి ఎదురుగా విష్ణు అనే యువకుడు నివసిస్తున్నాడు. కొంతకాలంగా వైష్ణవికి విష్ణుతో పరిచయం ఉండగా, ఈ పరిచయం భైజుకు నచ్చేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో విష్ణు, వైష్ణవి వాట్సాప్‌లో చాటింగ్ చేయగా, అతను కిస్ ఎమోజీ పంపాడు.
ఆ సందేశాన్ని చూసిన భైజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే కత్తి తీసుకుని విష్ణు ఉన్న చోటుకు వెళ్లాడు. మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో భైజు తీవ్ర ఒత్తిడికి గురై, అదుపు తప్పి విష్ణును నరికి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లి వైష్ణవిని కూడా హత్య చేశాడు.
పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు భైజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ హత్యలు గ్రామంలో తీవ్ర సంచలనం రేపాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments