సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడలు మండల స్థాయిలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.

ప్రారంభోత్సవ ప్రసంగంలో నాయకులు, క్రీడల వల్ల శారీరక మరియు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడం ద్వారా అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. కాబట్టి విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ పుష్ప అధ్యక్షతన, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ ఎస్ఎంసి చైర్పర్సన్ రవి, నరేష్, తహసిల్దార్ సరస్వతి, పెద్దమందడి ఎస్ఐ యుగంధర్ రెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్యం, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్స్, ఉపాధ్యాయులు, మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...