యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి
విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ క్రమంలో అధికారులు, సిబ్బంది ఏ సమస్య వచ్చినా డిస్కౌంట్ సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో సాహసోపేతంగా సిబ్బంది పనిచేసి గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపట్టారని అభినందించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది భద్రత చర్యలు తీసుకొని పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించే రాదని అన్నారు. ప్రతి వినియోగదారుడి పైన ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల మూలంగా విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడింది, నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ సీఎం డి రోనాల్డ్ రోస్, జే ఎం డి శ్రీనివాస్, ఓ ఏస్ డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments