మహిళ కడుపులో మూడు కేజీలు ఒవేరియన్ సిస్ట్ గడ్డ తొలగింపు
... డాక్టర్ పలిమెల దివ్య (ఎం ఎస్ఓ బి జి గైనకాలజిస్ట్) కు పలువురి అభినందన...
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం నగరంలోని మెట్రో హాస్పిటల్ లో... గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న సుధ అనే పేషెంట్ కు హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పలిమెల దివ్య గైనకాలజిస్ట్ సకాలంలో స్పందించి శస్త్ర చికిత్స ద్వారా ఎంతో శ్రమించి మూడు కేజీల ఒవేరియన్ సిస్ట్ ను తొలగించారు. ఈ సందర్భంగా హాస్పటల్ వైద్యులు డాక్టర్ పలిమెల దివ్య మాట్లాడుతూ సుధ అనే మహిళ పేషంట్ గత కొన్ని నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నానని తమ హాస్పిటల్ ను సంప్రదించారని, దీంతో మేము స్కాన్ టెస్టులు నిర్వహించి ఆమెకు కడుపులో ఒవేరియన్ సిస్ట్ ను ఉందని గుర్తించి, శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించామని, సుమారు మూడు కేజీల తేలిందని పేర్కొన్నారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న మహిళకు తమ నైపుణ్యంతో శస్త్ర చికిత్సను చేసి తొలగించిన డాక్టర్ పలిమెల దివ్య గైనకాలజిస్ట్ ని పలువురు అభినందించారు.
Comments