డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు ( రెండో రోజు) కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై స్వచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఖిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి , ఆలజడు లకు గురవుతుందన్నారు .సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని చెప్పారు .తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు, నూరి హప్ష,ఫైజా ఇరం తదితరులు పాల్గొన్నారు.

జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ అధ్యక్షురాలు హుసేన్ బీ. ఆధ్వర్యంలో స్కూళ్లను సందర్శించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను అందించి క్యాంపెయిన్ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకు నైతిక విలువల బోధించాలని టీచర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జహరా ఫాతిమా, మొమినా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...