ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలి
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్
- తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ కు వినతి పత్రం అందజేత
- బొల్లెపాక రాజేష్, తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రభుత్వం ఎస్సీ ఏబీసీడి వర్గీకరణ చేసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లెపాక రాజేష్ కోరారు.గురువారం హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమీషన్ చైర్మన్ శమీమ్ అక్తర్ ని కలిసి తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు వర్గీకరణ చేసి ఎస్సీ జాబితాలో ఉన్న59 కులాలతో పాటు వారికి జనాభా దామాషా ప్రకారం ఎవరికెంతో వారికి అంత వాటా ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ డిమాండ్ గత 30 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదన్నారు . ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన పేద కులాల ప్రజల స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగం ద్వారా అందాల్సిన ఫలాలు 59 కులాలకు సక్రమంగా అందడం లేదని 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుందన్నారు. షెడ్యూల్ కులాల ప్రజలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. స్వాతంత్రం కన్నా ముందే నిజాం కాలంలో భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో దళితుల అభ్యున్నతి కోసం జరిగిన కృషిలో కూడా ఎస్సీ జాబితాలో ఉన్న మాదిగ, ఉపకులాల ప్రజలకు అన్యాయమే జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణాధికారంతో 2011 జనాభా లెక్కల ఆధారంగానే కాకుండా2014, 2024 లో చేసిన (సమగ్ర కుటుంబాల సర్వే) జనాభా లెక్కల ఆధారంగా కోటాను పెంచి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణక చేసి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెండ్యాల సుమన్, పసునూరి సంపత్ కుమార్,గాదె పృథ్వి,చిట్యాల రమేష్,అనిల్,
కుమార్,కరుణాకర్ తదితరులు ఉన్నారు.
Comments