ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు : 

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

 WhatsApp Image 2024-12-04 at 9.32.42 PM  ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినపనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 

 అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...