114 మందిని బైండోవర్ చేసిన సత్తుపల్లి ఇన్స్పెక్టర్
సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కోడి పందెలను నియంత్రించేందుకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు చేపట్టినట్లు సత్తుపల్లి ఇన్స్పెక్టర్ కరణ్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లు, కోడిపందెం కేసుల్లో ఉన్న పాత నిందితులు, కోడి కత్తులు తయారు చేసే వారు, కట్టే వారిని మొత్తం 114 మందిని బైండోవర్ చేసినట్లు సత్తుపల్లి పట్టణ సీఐ కిరణ్ వివరించారు. బుధవారం 54 మందిని, గురువారం 63 మందిని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో హాజరుపరిచి, వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, కోడిపందేలు మరియు పేకాట నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగను ఉద్దేశించి, కోడిపందేలు మరియు జూదం నిర్వహణను నివారించేందుకు మండల, గ్రామస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని, కోడిపందేలు నిర్వహించేందుకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్ లను ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.
Comments