వాట్సప్‌లో వాయిస్‌ ఇక టెక్ట్స్‌ రూపంలో.. ఈ యూజర్లకు మాత్రమే!

వాట్సప్‌లో వాయిస్‌ ఇక టెక్ట్స్‌ రూపంలో.. ఈ యూజర్లకు మాత్రమే!

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో వాయిస్‌ చాట్‌ను టెక్ట్స్‌ రూపంలో చదువుకోవచ్చు.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను  ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్‌ మెసేజ్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. ఆడియో సందేశం వినలేని సందర్భాల్లో, అవతలి వ్యక్తి పంపించిన సందేశాన్ని టెక్ట్స్‌ రూపంలో రాసుకోవాల్సిన సందర్భంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీతో పాటు స్పానిష్‌, పోర్చుగీసు, రష్యన్‌ భాషలకు కొత్త ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయడానికి వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. అక్కడ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చుంటే ట్రాన్‌స్క్రిప్షన్‌ ఆఫ్‌/ ఆన్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకసారి యాక్టివేట్‌ చేసుకున్నాక వచ్చిన వాయిస్‌నోట్స్‌ను అక్షర రూపంలోకి మార్చుకోవడానికి దాని కిందే ఓ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కొందరికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరూ వినియోగించడానికి వీలవుతుంది. వాట్సప్‌ వెబ్‌ వెర్షన్‌లో ఈ ఆప్షన్‌ కనిపించదు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...