అక్రమంగా నిల్వ చేసిన 600 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న ఆర్బన్ పోలీసులు

ఇన్స్‌పెక్టర్ భాను ప్రకాష్ 

అక్రమంగా నిల్వ చేసిన 600 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న ఆర్బన్ పోలీసులు

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ అన్నారు. ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ప్రాంతాలో  అక్రమంగా పాత రైస్ మిల్లులో 600 బస్తాల రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖానాపురం హవేలి పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు చేసి పట్టుకున్నారు.ఈ బియ్యం ఎక్కడి నుంచి సేకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరు ఈ పనికి పురామయించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారని, ప్రాథమికంగా షేక్ నజీర్ 28 సం,, అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలనే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. WhatsApp Image 2025-01-07 at 9.19.37 PMఅక్రమ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ర్రాష్ట్ర సరిహద్దు రవాణాపై నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామనివెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...