రైతులను నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ సర్కార్.
కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్.
- అంబేడ్కర్ ఇచ్చిన హక్కులను కాలరాస్తుంది కాంగ్రెస్ పార్టీ.
- ఆశ పడితే గోస పడతాం అన్న కేసీఆర్ మాట నిజమైంది.
- స్థానిక ఎన్నికల లబ్ధి కోసమే రైతు భరోసా ప్రకటన.
- అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రైతులను వంచించిందని, స్వయంగా ఆరు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల మాటలు నీటి ముటల వలె తేలిపోయాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే వంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. గతంలో
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఎకరానికి రూ.10వేల రైతు బంధు ఇవ్వగా, తాము ఎకరానికి రూ.15వేలు ఇస్తామని మాయ మాటలతో రైతులను మబ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రూ.15వేలకు బదులుగా రూ 12వేలు ఇస్తామని రైతన్నకు వెన్నుపోటు పొడిచిన వైఖరిని నిరసిస్తూ మెదక్ జిల్లా టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రైతులు పెద్ద ఎత్తున టేక్మాల్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా అందోల్ మాజీ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. మాయ మాటలు చెప్పిన వారు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికి ఇప్పటికి చాలా గ్రామాలలో రుణమాఫీ కాలేనివారు చాలా మంది రైతులు ఉన్నారని, అందులో అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని కాంగ్రెస్ కార్యకర్తలే బాధపడుతున్నారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు వస్తలేదని, కేసీఆర్ కిట్టు వస్తలేదని, కల్యాణ లక్ష్మీ షాదిముబారక్ తులం బంగారం వస్తలేదన్నారు. ఈ వర్షకాలం వరి ధాన్యం కొనుగోలులో సగానికిపైగా దాన్యం దళారుల పాలైందన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేని రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యాన్ని అమ్ముకున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 24గంటలు వ్యవసాయానికి కరెంటు ఇస్తే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్ధితి నెలకొందన్నారు. కేసీఆర్ సార్ చెప్పినట్లు ఆశ పడితే గోస పడతాం అనే విషయం నిజమైందన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్న రైతు భరోసా కూడా కేవలం స్థానికల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటన తప్ప రైతుల శ్రేయస్సు కోసం చేసిందికాదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు కూడా మోసపోతే మరో నాలుగేళ్లపాటు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు.ఈకార్యక్రమంలో టేక్మాల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, బీఆర్ఎస్ పార్టీ నాయకులు జైపాల్ రెడ్డి, నాగభూషణం, యశ్వంత్ రెడ్డి, కమ్మరి సిద్దయ్య, నాయికోటీ భాస్కర్, యంఏ సలీం, చింతా రవి, రేగోడ్ మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు వినోద్, నారాయణ, శ్రీనివాస్, పౌలు, రమేష్ నాయక్, హనుమ గౌడ్, సాయిబాబా, గోవిందా చారి, సాయిబాబా మల్లేశం, బన్నయ్య, సుధాకర్, మాణిక్యం, అల్లావుద్దీన్, సత్యం, మహేందర్, సంతోష్, శ్రీనివాస్, సాయిబాబా, రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Comments