యువత మత్తు పదార్థాలకు, ఆన్లైన్ క్రీడలకు బానిసలుగా మారకుండా క్రీడలో రాణించాలి.

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర.శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ లు పిలుపు.

యువత మత్తు పదార్థాలకు, ఆన్లైన్ క్రీడలకు బానిసలుగా మారకుండా క్రీడలో రాణించాలి.

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

నేటి యువత మత్తు పదార్థాలకు,ఆన్లైన్ క్రీడలకు బానిసలుగా మారకుండా క్రీడలో రాణించాలని గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకొచ్చేల ప్రభుత్వాలు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర.శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ లు,వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభ సభలో వక్తలు పిలుపునిచ్చారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక చి గ్రామంలో డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్. గ్రామ కమిటీల ఆధ్వర్యంలో దాతల సహకారంతో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్ర.శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ లు అతిధులుగా డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ జిల్లా కార్యదర్సులు షేక్.బసీరుద్దీన్,టీ.ప్రవీణ్,రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,గ్రామ పెద్దలు హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకోనీ వాలీబాల్ టోర్నమెంట్ నీ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ నేడు క్రీడలతోనే ప్రజలందరికీ మానసిక ఉల్లాసం కలుగుతుందని,నేడు సమాజంలో క్రీడలకు చాలా ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు.నేటి యువత పెడధోరనులకు గురికాకుండా క్రీడలో రాణిస్తూ అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దుగ్గి.కృష్ణ లు మాట్లాడుతూ నేటి యువత టెక్నాలజీ యుగంలో ఆన్లైన్ క్రీడలకు ఆకర్షితులై శారీరక మానసిక ఉల్లాసాన్ని కోల్పోతున్నారని,ప్రిపేర్ లాంటి ప్రమాదకర క్రీడలు ఆడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటు ఆ యసనంతో ప్రపంచానికి దూరమై పోతున్నారని వారు అన్నారు.నేటి యువత చెడు అలవాట్లకు,పెడ ధోరణులకు లోనుకాకుండా క్రీడలలో రాణించాలని,నేటి యువత మత్తు పదార్థాలకు,ఆన్లైన్ క్రీడలకు బానిసలుగా మారకుండా క్రీడలో రాణించాలని గ్రామీణ క్రీడలకు పూర్వవైభవం తీసుకొచ్చేల ప్రభుత్వాలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.WhatsApp Image 2025-01-15 at 9.30.38 PMఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జోనెబోయిన.పాపయ్య,సీపీఐగ్రామ శాఖ కార్యదర్శి ప్రొద్దుటూరి.వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకుడు నర్సిరెడ్డి,జనసేన మండల అధ్యక్షుడు స్రవంత్ ఖన్నా,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్,కాంగ్రెస్ నాయకులు తూము.సత్యనారాయణ,బోడపట్ల.శ్రీను,డి.వై.యఫ్.ఐ,యస్.యఫ్.ఐ గ్రామ,మండల నాయకులు గణేష్,వీరబాబు,వినోద్,నవీన్,నఫీర్,సమీర్,సురేష్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...