ఆదివాసి న్యాయ కళాశాలపై ఉద్యమిస్తాం

జీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి...

ఆదివాసి న్యాయ కళాశాలపై ఉద్యమిస్తాం

తెలంగాణ ముచ్చట్లు (నూగురు )వెంకటాపురం ములుగు జిల్లా 
ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తామని,త్వరలో గొండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు కార్యకర్తలు దండయాత్రకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.గురువారం నాడు వెంకటాపురం ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ ఆవరణంలో జి.ఎస్.పి ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. 5వ షెడ్యూల్ భూభాగంలోని భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఒరిస్సా, చతిస్గడ్, భద్రాచలం కేంద్రంగా నాయకళాశాల ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ఆదివాసి యువతీ యువకుల ఆదివాసి చట్టాలపై అవగాహన ఉంటుందని ఆయన అన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఆదివాసి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగే ఉన్నాయని, ఆదివాసి బ్రతుకులు ఏమాత్రం మారలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. ఆదివాసీల కోసం ఐటిడిఏ ఉన్నప్పటికీ ఆదివాసి విద్య,ఉద్యోగ అవకాశాలు వైపు తీసుకుపోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసిలు పడుతున్న సమస్యలు నియోజకవర్గ ఆదివాసీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు చట్టసభలో ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఏజెన్సీ చట్టాలపై ఏమాత్రం గౌరవం ఉన్న 1/70  పేసా చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ప్రభుత్వాన్ని ఆదివాసి ఎమ్మెల్యేలు డిమాండ్ చేయాలని కోరారు.అలాగే భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ న్యాయ కళాశాల ఏర్పాటుకై అసెంబ్లీలో ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసి సమాజ ఆదివాసీ ఎమ్మెల్యేలను ద్రోహులుగా చూస్తుందని పూనెం సాయి అన్నారు. త్వరలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ కళాశాలకై ఉద్యమిస్తామని త్వరలో తేదీని కూడా ఖరారు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కారం ఆనంద్,శంకర్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...