సంక్రాంతి శోభతో కళకళలాడిన  స్మార్ట్ కిడ్జ్ పాఠశాల.

పాఠశాల ప్రాంగణంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సంబురాలు.

సంక్రాంతి శోభతో కళకళలాడిన  స్మార్ట్ కిడ్జ్ పాఠశాల.

-- హరిదాసు కీర్తనలు , గొబ్బెమ్మలు, రంగవల్లులతో కోలాహలం.

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

సంక్రాంతి పర్వదిన శోభతో స్మార్ట్ కిడ్జ్ పాఠశాల శనివారం కళకళలాడింది.
తెలుగు లోగిళ్లలో ప్రధానమైన పెద్ద పండుగ సంక్రాంతి పర్వదిన సంబురాలు స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో ఆనందోత్సవాలతో నిర్వహించారు. తెలుగుదనం , సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రకృతి పండుగ సంక్రాంతి ని పాఠశాల విద్యార్థులు హుషారుగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో  శోభాయమానంగా తీర్చిదిద్ది గొబ్బెమ్మలను నవధాన్యాలతో , గౌరీ మాతతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, డు డూ బసవన్నల ఆటపాటలతో , గాలిపటాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. భోగి పర్వదిన వేడుకలలో భోగి మంటలు వేసి భోగి కుండల్లో పొంగలి వండి అందరికీ పంచి చిన్నారులకు భోగి పండ్లు పోసే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధాన్య రాశులతో, పాడిపంటలతో కుటుంబ సభ్యులు సరదాగా సంబురంగా జరిపుతూ ఎడ్ల పందాలు, కోడిపందాలతో హుషారుగా నిర్వహించే సంక్రాంతి పర్వదిన సంబురాలు సన్నివేశాలు అందరినీ హూషారెత్తించాయి. రైతన్నలు జీవన నేస్తాలతో జరుపుకునే కనుమ పర్వదిన సంబురాలు అందరినీ  అబ్బురపరచాయి. పాఠశాల చిన్నారులు బొమ్మల కొలువు పెట్టి మూడు పర్వదినాల వేడుకలను సంబురాల సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ తెలుగింటి పర్వదినాలలో సంక్రాంతి పర్వదినానికి ప్రముఖ ప్రాధాన్య స్థానం ఉందన్నారు. చిన్నారుల నుంచి మొదలుకొని అన్ని వయసులవారు సంక్రాంతి సంబరాలలో  పాల్గొని కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా అందరూ కలిసిమెలిసి ఈ ప్రకృతి పండుగను జరుపుకునే సాంప్రదాయం అనాదికాలం నుంచి ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తుందని తెలియజేశారు. మూడు పండుగలు కలిసిన పెద్ద పండుగ సంక్రాంతి సంబరాలు పల్లె, పట్టణం తారతమ్యం లేకుండా  ఇంటింటా కోలాహాలంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారుWhatsApp Image 2025-01-11 at 9.20.36 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...