శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్ పశ్చిమ, తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ న్యూ శాయంపేట ధోణగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో రూ. 54 లక్షలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతర్గత రోడ్డు, సైడ్ డ్రైనేజీ, ఆలయ చుట్టూ గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమవుతాయని వారు తెలిపారు.అంతకుముందు ఎమ్మెల్యే, మేయర్‌లు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న శ్రీ గోదాదేవి కళ్యాణ వేడుకలో అంగరంగ వైభవంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఆవరణలోని గోశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మోహన్ రావు, డివిజన్ అధ్యక్షుడు సురేందర్, నాయకులు రమేష్, కృష్ణ, వేణు, అలాగే అధికారులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Comments