హెవీ వెహికిల్స్ నడిపే డ్రైవర్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ నడపాలి
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హెవీ వెహికల్ నడిపే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వాహనాలను ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ నడపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం హనుమకొండ ములుగు రోడ్డు పరిధిలోని ఆర్టీసీ శిక్షణ కళాశాలలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం, లైట్, హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణ ముగింపు, ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ నుండి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. హెవీ వెహికల్ నడపడం మామూలు విషయం కాదని, చాలా జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. డ్రైవింగ్ లో నైపుణ్యాలను గురించి శిక్షణలో తెలుసుకున్నారని అన్నారు. అర్బన్ ప్రాంతంలో ఉన్న జిల్లాకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలన్నారు. శిక్షణ పొంది ధ్రువీకరణ పత్రాలు పొందిన వారు టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ ఎస్టీలకు రాయితీ వస్తుందని, జిల్లా స్థాయి కమిటీలో సబ్సిడీని అప్రూవ్ చేస్తుంటామన్నారు. శిక్షణ పొందిన వారు వెహికల్ లోన్ తీసుకునేందుకు కన్సిడర్ చేస్తామన్నారు. జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో వచ్చే వారంలో జాబ్ మేళాను కృషి చేస్తామన్నారు. రోడ్డు సేఫ్టీ అనేది ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ నెలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ఈ సందర్బముగా డ్రైవింగ్ లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ జిఎం ఆనంద్, రవాణా శాఖ డీటీసీ శ్రీనివాస్, ఆర్టీసీ డైరెక్టర్ ట్రైనింగ్ సుధా పరిమళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఆర్టీసీ ఐటిఐ ప్రిన్సిపల్ అర్పిత, ఇతర అధికారులతో పాటు శిక్షణ పొందిన డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments