గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానం
గోడ పత్రిక ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Views: 1
On
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ గోడపత్రికను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను గురుకులాల్లో చేర్పించేందుకు ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చేరి ఉన్నత భవిష్యత్తుకు మార్గం సుగమం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, రీజనల్ కోఆర్డినేటర్ గంగరామ్ నాయక్, జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ రాయ్, కౌడిపల్లి పాఠశాల ప్రిన్సిపల్ ఫణి కుమార్, ఉపాధ్యాయుడు ఉదయ్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments