ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయండి

ఎమ్మార్పీఎస్ నేతలు గంగారపు శ్రీనివాస్,శాంతి సాగర్

ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయండి

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ఫిబ్రవరి 7న లక్ష డప్పులు, వెయ్యి గొంతుల సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నేతలు గంగారాపు శ్రీనివాస్ మాదిగ,శాంతి సాగర్ మాదిగ పిలుపునిచ్చారు. ధర్మసాగర్ మండలంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడాలని, మాదిగలందరూ ఏకతాటిపై నిలవాలని  నాయకులు కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేల్కొల్పేందుకు ఫిబ్రవరి 7న భారీ సభ నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతి సాగర్ మాదిగ వెల్లడించారు. సోంపల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ, శాంతి సాగర్ మాదిగ పాల్గొన్నారు.

మండలంలోని ఎస్సీ, బీసీ కాలనీలలోని డప్పు కళాకారులతో కలిసి లక్ష డప్పుల తోపుతో సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా ఎస్సీ వర్గీకరణను తక్షణం అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.మాదిగల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని వారంతా పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అనుబంధ సంఘాల నేతలు చిలుక రాజు మాదిగ, కొట్టే కళ్యాణ్ మాదిగ, మాచర్ల బాబు మాదిగ, రాహుల్ మాదిగ, బొడ్డు రణధీర్, కనకం జయపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...