మారెడ్డి వెంకట నర్సయ్యకు కన్నీటి వీడ్కోలు
మేనమామ పాడెమోసిన మాజీ ఎంపీ నామ సోదరులు..
అంతిమ యాత్రలో పాల్గొన్న జిల్లా ప్రముఖులు
శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించిన మారెడ్డి సోదరులు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: తమ మేనమామ మారెడ్డి వెంకట నరసయ్య అంతిమయాత్రలో పాడే మోసి, దహన సంస్కారాలలో పాల్గొని మాజీ ఎంపీ నామ సోదరులు తమ రక్త సంబంధానికి ఉన్న విలువను చాటుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన మారెడ్డి వెంకట నరసయ్య శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు మాతృమూర్తికి స్వయనా సోదరుడైన వెంకట నరసయ్య మృతి చెందారన్న వార్త తెలుసుకొని ఖమ్మం నగరం లోని బ్యాంక్ కాలనీ నందు వారి స్వగృహంలో వెంకట నరసయ్య పార్థివదేహాన్ని మాజీ ఎంపీ నామ సోదరులు వారి కుటుంబ సభ్యులు సందర్శించి పూలమాలలు వేసి కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, ఆయన సతీమణి చిన్నమ్మ, వారి కుమారుడు భవ్యతేజ, కోడలు, నామ సోదరుడు నామ రామారావు వారి కుమారుడు సాయిరాం, సోదరులు సీతయ్య, కృష్ణయ్య, సోదరిమణులు ధనమ్మ వారి కుమారుడు శ్రీను, తులసమ్మ వారి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి వారి ఆత్మీయ బంధువుకు కడసారి వీడ్కోలు పలికారు. కాగా నామ, ఆయన సోదరులు వారి మేనమామతో వారికి ఉన్న అనుబంధాన్ని గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మారెడ్డి వెంకట నరసయ్య మృతి చెందారని తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ, సామాజిక సంఘాల ప్రముఖులు, శ్రేయోభిలాషులు శనివారం ఉదయం వెంకట నరసయ్య గారి నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మారెడ్డి వెంకటనర్సయ్య ముగ్గురు కుమారులు... మారెడ్డి సీతారామయ్య, నాగేశ్వరరావు, వీరయ్య వారి తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సీ బిఆర్ఎస్ ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు,మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం నగర మేయర్ పూలుకొల్లు నీరజ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, బిఆర్ఎస్ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, డిసిసిబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, కార్పోరేటర్ దండా జ్యోతి రెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర, బిఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, చింతకాని మండల మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, బిఆర్ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ మోతుకూరి సుధాకర్, మాజీ సర్పంచ్ మెంటెం రామారావు, మోరంపూడి ప్రసాద్ రావు, గోడ్డేటి మాధవరావు,టిడిపి జిల్లా సీనియర్ నాయకులు కేతినేని హరీష్, తిరుమలాయపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాషబోయిన వీరన్న, తన్నీరు రవి, బత్తుల శ్రీను, మోతుకూరి శ్రీను, సామినేని శేషగిరిరావు, యువజన నాయకులు చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments