తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో టిఎస్ టియు సంఘం పాత్ర విలువైనది
ప్రభుత్వ విద్యారంగంలోని ఉన్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలి
-టీఎస్ టియు సంఘం- 2025 డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ
-ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్/ తెలంగాణ ముచ్చట్లు :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో టి ఎస్ టియు (తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్) పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.టీఎస్ టియు సంఘం రూపొందించిన 2025 డైరీ,క్యాలెండర్ ను టీజేఎస్ కార్యాలయంలో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికి ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని,రాష్ట్ర అభివృద్ధి విద్యారంగ అభివృద్ధి పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన ద్వారా సాధ్యం అవుతుందని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పునరంకితమై కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయుల,ఉద్యోగుల, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల,ఆర్థిక బిల్లుల మందార,డిఎ,పిఆర్ సి తదితర సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో టిఎస్ టియు రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి, సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు అరకల కృష్ణగౌడ్, సంఘ రాష్ట్ర నాయకులు తీనివాసంది అల్లె పరమేశ్వర్, సురేందర్,అప్సార్ అహ్మద్, షబానా మునావర్,జిల్లా నాయకులు ఇక్బాల్, అహ్మదాఖాన్,శ్రీనివాసరెడ్డి, కొమురయ్య, ఫరీద్, హమీద్, కిషోర్,రవి ఎలమదాసరి, వజియోద చంద్రశేఖర్, రహమతుల్లా,పెద్ద ఎత్తున నాయకులు టీజేఎస్ హైద్రాబాద్ జిల్లా అధ్యక్షులు నర్సయ్య,ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments