రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు అందరి జీవితాల్లో ఆనందం, అభివృద్ధి, సిరి సంపదలు ప్రసాదించాలని కోరారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం ప్రజల జీవితాల్లో శుభాలు నింపాలని ఆకాంక్షించారు.
సంస్కృతి, సాంప్రదాయాలను పరిమళింపజేసే ఈ పండుగలో కుటుంబ సభ్యులతో కలిసి పండగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ప్రతి ఇంటి ఆవరణను అలంకరించాలని, పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆహ్వానించారు.
సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మంత్రి ప్రస్తావించారు. రైతుల కోసం తీసుకున్న కీలక నిర్ణయాలు—2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడం, సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందించడం, రైతు భరోసా మొత్తాన్ని రూ. 12,000కి పెంచడం—రైతు కుటుంబాలకు సంతోషాన్ని అందించాయని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ కానుక ద్వారా భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందించడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, ఇళ్లు లేని పేదల కోసం ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు.ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సిరి సంపదలు, సుఖసంతోషాలను నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
Comments