రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం 

వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తాం 

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం 

-- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లాలో పర్యటించి సుమారు రూ. 23.30 కోట్ల నిధులతో  రెండు విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవంతో పాటు మరో 7 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు.  రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామంలో రూ. 2.06 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రం , గోపాల్పేట మండల పరిధిలోని ఎదుట్ల గ్రామంలో రూ.1.96 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను  ప్రారంభోత్సవం చేశారు.  అనంతరం వనపర్తి పట్టణం విద్యుత్ సబ్ స్టేషన్ ముందు వనపర్తి మండలానికి చెందిన  కాశీంనగర్, నాగవరం,  మెట్టుపల్లి, చిననగుంట పల్లి, పెద్దమందడి మండలానికి సంబంధించిన   పామిరెడ్డిపల్లి, గోపాల్పేట మండలం తాడిపర్తి, శ్రీరంగాపురం మండలానికి సంబంధించిన నగరాల ఉప విద్యుత్ కేంద్రాలను శంఖుస్థాపన చేశారు.  అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న 50 మంది రైతులకు 50 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు.
అనంతరం వనపర్తి జిల్లా ఐడిఓసి పైన పునరుద్ధరణీయ విద్యుత్ శక్తిని  సృష్టించేందుకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 
పాలమూరు రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి  వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని అదేవిధంగా మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ఇస్తామని తెలియజేశారు.  ఇందుకు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లల్లో ఉత్పత్తిని దుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.  వనపర్తి జిల్లాలో నేడు రెండు విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించడంతోపాటు మరో ఏడూ విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ తీగలు లైన్ మార్చడం, స్తంభాలు మార్చడం వంటింకార్యక్రమాలకి ఇప్పటికీ రూ. 45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పై ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రతి వ్యవసాయ యోగ్యమైన  భూమికి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు క్యాబినెట్లో ఆమోదం తీసుకోవడం జరిగింది అన్నారు.  జనవరి 26 నుండి అర్హులైన ప్రతి రైతుకు 12 వేల రూపాయలు రైతు భరోసాగా ఇవ్వడం జరుగుతుందన్నారు. భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని జనవరి 26 నుండి  ప్రారంభించడం జరుగుతుందన్నారు.ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, ఇంకా ఎవరైనా రుణమాఫీ కానివారు ఉంటే వారికి సైతం రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఎన్ని సమస్యలు ఉన్నా రైతాంగానికి  ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు.  ఉచిత విద్యుత్తు అనేది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు.  ట్రాన్స్ఫార్మర్ కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. WhatsApp Image 2025-01-09 at 8.30.19 PM
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి ఆర్థిక శాఖ మంత్రి హామీతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అయిదు సంవత్సరాల్లో లక్ష కోట్లు మంజూరు చేయడం జరుగుతుందని హామి ఇచ్చారని గుర్తు చేశారు. లక్ష కోట్ల  నిధులతో  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలో ముందు వరసలో పెట్టడం  జరుగుతుందని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ.. రైతులకు ఇరిగేషన్ ఎంత ముఖ్యమో విద్యుత్ అంతే ముఖ్యమని చెప్పారు.  ఈనెల చివర్లో జిల్లాలో భారీ రుణ మేలా, భారీ జాబ్ మేళ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.స్థానిక శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి మాట్లాడుతూ.. అడిగిన వెంటనే వనపర్తి జిల్లాలో విద్యుత్ సమస్యల నివారణకు రూ. 40 కోట్లు మంజూరు చేశారని నేడు మరో 24 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసినందున ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. 
జిల్లాలో 14 సంక్షేమ వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని వాటిని స్వంత భవనాలు నిర్మించుకునేందుకు రూ. 92 కోట్ల  నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రిని  కోరారు. పెబ్బేరు లో ఒక సబ్ స్టేషన్, 30 పడకల వైద్య ఆరోగ్య కేంద్రం, ఘనపూర్ లో డిగ్రీ కళాశాల మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అదేవిధంగా వనపర్తి మున్సిపాలిటీ ని గ్రెడ్ 3 నుండి గ్రేడ్ 2 కు మార్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పడిన సంవత్సర కాలంలో రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి  రూ. 78 వేల కోట్లు ఖర్చించేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర విద్యుత్ శాఖ  సిఎండి ముషారఫ్ అలీ, జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి, జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, , మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి,  విద్యుత్ శాఖ సీఈ యు. బాలస్వామి, డైరెక్టర్ నందకిషోర్, ఎస్ ఈ రాజశేఖరం, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు   పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...