ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక.

క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక.

మెదక్ ఆర్డీవో రమాదేవి.

మెదక్ బ్యూరో తెలంగాణ ముచ్చట్లు:

మెదక్ పట్టణంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా  లబ్ధిదారుల ఎంపికకు కసరత్తును గురువారం ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతోన్న సర్వే సరళిని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నిరుపేదలను గుర్తించాలని, భూములు, ఆదాయం, వంటి వివరాలను తప్పులు లేకుండా ఫార్మ్ లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ సర్వేలో భాగంగా విచారణలో తేలిన వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు,ఆర్ ఐ లక్ష్మణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...