ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

ఏఆర్ కానిస్టేబుల్ కు కాంస్య పతకం

  ఉప్పల్/ తెలంగాణ ముచ్చట్లు:
వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ఏఆర్.పిసి -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం జరిగింది.ఈ పోటీలలో దాదాపు 30 దేశాల నుండి దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సిపి సుధీర్ బాబు ఐపీఎస్ సంజీవ్ కుమార్ ను అభినందించి సత్కరించారు.ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ,వివిధ క్రీడలలో ఇలాగే తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...