ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందండి

ఏజెన్సీ ప్రాంతంలో అర్హులoదరికీ స్వయం ఉపాధి కల్పిస్తాం

ప్రభుత్వ పథకాలతో లబ్ది పొందండి

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

 ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధి పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు  తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వీరు పర్యటించారు. దమ్మపేట మండలం కట్కూరులో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పూసుకుంట గ్రామంలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. పామాయిల్ రైతులతో, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందేలా.. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఇక గ్రామాల్లో.. మహిళలు, యువతీ యువకులు  స్వయం ఉపాధి పొందేలా.. బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను, యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అర్హతలు, వనరులను బట్టి ఆ యూనిట్లను సద్వినియోగం చేసుకుని.. ఆర్థిక పరిపుష్టి పొందాలని సూచించారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతoలో.. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిoదని.. ఉగాది పండుగ నాటికి నిర్మాణాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. WhatsApp Image 2025-01-11 at 9.22.52 PM
ఈ కార్యక్రమంలో.. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పిఓరాహుల్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...