ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

జిల్లా విద్య శాఖ అధికారి సొమ శేఖర శర్మ

ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

-ఘనంగా శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ 30 వ వార్షికోత్సవం

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్య శాఖ అధికారి సొమ శేఖర శర్మ అన్నారు. శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల 30వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి  ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ముందుగా  స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిషిత శర్మ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ దుస్తులు ధరించి జానపద కళా రూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యార్థులతో పాటు పోలీస్ కమిషనర్ సునీల్ దత్  పాఠశాల ఆవరణలో ఆహ్లాదంగా గడిపారు.
కార్యక్రమానికి ముఖ్యతిధిగా హజరైన జిల్లా విద్య శాఖ అధికారి మాట్లాడుతూ......ఉత్తమ విద్య విద్యార్థి భవితను దిశానిర్దేశం చేస్తాయనీ, సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు.  లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమనీ, ఇష్టపడి చదివి పాఠశాలకు,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.WhatsApp Image 2025-01-11 at 9.23.37 PM

స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిషిత శర్మ మాట్లాడుతూ..విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు నిర్దేశిత ప్రణాళికలను అనుసరించాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పి, నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమైయేలా వారి జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారని అన్నారు.  కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సుశీల్ సింగ్, ఆర్ ఐ కామరాజు,  స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...